మంచిర్యాల నుంచి చెన్నూరు వరకు ఉన్న పలు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం చెన్నూరు నియోజకవర్గం లోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వివేక్ ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.