అడివి పంది దాడిలో గాయపడిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్

1355பார்த்தது
అడివి పంది దాడిలో గాయపడిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్
మందమర్రి లో ఎస్ అండ్ పి సి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న వేముల స్వామికి గురువారం రాత్రి అడవి పంది దాడిలో కుడి కాలి పాదం విరగడం జరిగింది. గాయపడిన కార్మికుడిని ఏరియా హాస్పిటల్ కి వెళ్లి పరమర్శించిన కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు బెల్లంపల్లి రిజియన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్. ఈ సందర్భంగా దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న ఎస్ అండ్ పి సి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు భద్రత లేకుండా దినదిన గండంగా గడుస్తున్నాయి. ఒకవైపు దొంగల దాడులతో సతమత అవుతుంటే మరోవైపు ఇలాంటి ప్రమాదాల వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తున్నాయి. ప్రమాదంలో గాయపడిన వేముల స్వామి కార్మికునికి మెరుగైన వైద్యం అందించి తను పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వేతనంతో కూడిన రెస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు కార్మికులకు జరుగుతున్న వరుస ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రమాదాలను నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు తరపున డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி