సింగరేణి డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ప్రేమ్ కుమార్ బెల్లంపల్లి ఏరియాలో మంగళవారం పర్యటించారు. ఖైరిగూడ ఓసీ పని స్థలాలకు చేరుకొని బ్లాస్టింగ్ విధానాన్ని పరిశీలించారు. బ్లాస్టింగ్ సమయంలో తీసుకుంటున్న రక్షణ చర్యలపై ఆరా తీశారు. ఈస్ట్ వ్యూ పాయింట్ నుండి బ్లాస్టింగ్ ను వీక్షించారు. ఎక్ష్ప్లోసివ్స్ భద్రపరిచే మ్యాగజిన్ కేంద్రాన్ని పరిశీలించారు. రక్షణ చర్యలపై అధికారులకి సూచనలిచ్చారు.