పీవీ రావు కాలనీలో ముగ్గుల పోటీలు

569பார்த்தது
పీవీ రావు కాలనీలో ముగ్గుల పోటీలు
దహేగాం మండలంలోని పీవీరావు కాలనీలో సంక్రాంతి పండుగని పురస్కరించుకొని పీవీరావు కాలనీలో మంగళవారం ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలో కాలనీలోని మహిళలు, పిల్లలు పాల్గొని రకరకాల ముగ్గులు అందంగా వేశారు. ఈ పోటీలలో మొదటి బహుమతి పొందిన లలితకి 500, రెండవ బహుమతి పొందిన కీర్తికి 250, మూడవ బహుమతి పొందిన తిరుమలకి 100 రూపాయలని నిర్వాహకులు బహుమతులుగా అందచేసాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி