సింగరేణి క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో పతకాలు సాధించి సింగరేణికి, బెల్లంపల్లి ఏరియాకు మంచి పేరు తీసుకురావాలని ఏరియా జిఎం శ్రీనివాస్ సూచించారు. బెల్లంపల్లి ఏరియాలోని గోరేటి భీమన్న క్రీడా మైదానంలో నిర్వహించిన 91వ వార్షిక క్రీడలో భాగంగా డిపార్ట్మెంటల్ స్థాయి హాకీ క్రీడలు నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన జిఎం క్రీడలను ప్రారంభించి క్రీడాకారులకు పలు సూచనలు చేశారు.