డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అని అన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు.