మారుమూల గ్రామాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు పెద్దపీట వేస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్డిఎఫ్ 4 లక్షల ఎదుట నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామంలో నిర్మించే సైడ్ డ్రైన్ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన స్పష్టం చేశారు.