అర్ధరాత్రి 12 గంటల సమయం వరకు నిషేధిత డీజేతో బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆంక్షలు పాటించని నిర్వాహకుడు, యజమానిని తాండూర్ తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో దసరా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. డీజేలకు అనుమతులు లేవని తెలిపారు. రాత్రి 10 గంటల లోపు బతుకమ్మ వేడుకలను ముగించుకోవాలని కోరారు.