ఎస్సీ వర్గీకరణను ఏమాత్రం సమ్మతించబోమని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఎస్సీలందరికీ సమంగా చెందాల్సిందేనని మాల, మాల ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ తొగరు సుధాకర్ అన్నారు. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన పోస్టర్ ను శనివారం వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘాల కో కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.