ఎన్నికలకు ముందు మావోయిస్టులను కీర్తించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బూటకపు ఎన్‌కౌంటర్ల పేరిట విచ్చలవిడిగా హత్యలకు పూనుకుంటున్నారని యుసిసిఆర్ఎంఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల మహేందర్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నం శంకర్, మొగిలి తదితరులు ఉన్నారు.