రాజీ కుదుర్చుకోదగిన అన్నిరకాల కేసులను లోక్ అదాలత్ ద్వారా వెంటనే పరిష్కారం జరుగుతుందని వనపర్తి జిల్లా జడ్జి సునీత అన్నారు. కక్షిదారులు శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం జిల్లాకోర్టు ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, బ్యాంక్ రికవరీ, చెక్ బౌన్స్, కుటుంబకేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు.