వనపర్తి జిల్లాలో గ్రూప్- 3 పరీక్షల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. 8664 మంది అభ్యర్థులకు గాను పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు శుక్రవారం టిపిపిఎస్సి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.