వనపర్తి: నెల రోజుల్లో అందరికీ రుణమాఫీ: ఎమ్మెల్యే

54பார்த்தது
వనపర్తి: నెల రోజుల్లో అందరికీ రుణమాఫీ: ఎమ్మెల్యే
అన్నదాతలు అధైర్యపడాల్సిన అవసరంలేదని, నెల రోజులలో అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేయనున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. ఆదివారం వనపర్తి కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. 10 ఏళ్ల కాలంలో రూ. లక్ష రుణమాఫీ చేయని బిఆర్ఎస్ నేతలు కొందరు రైతుల పక్షాన ముసలి కన్నీరు కారుస్తూ నిరసనలు చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

தொடர்புடைய செய்தி