వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. వనపర్తి జిల్లా నలుమూలల నుంచి వచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్ట పరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.