వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి హాల్లో సోమవారం అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారితో కలిసి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. అధికారులు ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటంపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదు దారునికి సమాచారం ఇవ్వాలని సూచించారు.