అంబేద్కర్ విధానాలను అవలంబిస్తున్న పార్టీ బీజేపీ అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని, పరిసరాలను శుభ్రం చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను అన్ని గ్రామ, పట్టణాల్లో ఘనంగా నిర్వహించాలని చెప్పారు.