మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామ చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులను అభివృద్ధి చేయాలని సదుద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ హనుమంతు మత్స్యకారులు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.