నారాయణపేట: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

83பார்த்தது
నారాయణపేట: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఏఎస్సై ఆంజనేయులు అన్నారు. మంగళవారం నారాయణపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. లాటరీ తగిలిందని కొంత డబ్బు జమ చేస్తే లాటరీ డబ్బు ఇస్తామంటూ చెప్పే మాటలు నమ్మకూడదని చెప్పారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఎటిఎం, ఓటిపి వివరాలు చెప్పరాదని హెచ్చరించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி