మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని ప్రోబేషన్ ఎస్సై గాయత్రి అన్నారు. గురువారం నారాయణపేట పట్టణంలోని ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో తరలిస్తున్న వస్తువులను, వాహనాల పత్రాలను పరిశీలించారు. డ్రైవర్లకు, వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఏఎస్సై ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.