మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో ఆదివారం అయిదవ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి పసుపుతో చేసిన గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ జానపద, భక్తి పాటలకు బతుకమ్మలు అడి పాడారు. గ్రామ మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.