మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఆరవ రోజు అమ్మవారు 11, 11, 111 (పదకొండు లక్షల, పదకొండు వేల, నూట పదకొండు) రూపాయల కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామస్తులు దుర్గామాతను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు.