శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టుకు 1979లోనే అంకురార్పణ జరిగింది. 1982 జూలై 29న రూ. 480 కోట్లతో సొరంగ మార్గం పనులు చేపట్టాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో చేసింది. కానీ ఎలాంటి పనులు మొదలు కాలేదు. 22 ఏళ్ల తర్వాత 2005లో దివంగత సీఎం వైఎస్ఆర్ ఎస్ఎల్బీసీ రూ. 2, 813కోట్ల అంచనాతో రెండు సొరంగాల నిర్మాణ పనులకు 2006 లో శంకుస్థాపన చేశారు. ప్రస్తుత అంచనా విలువ రూ. 4, 637. 75 కోట్లకు చేరుకుంది.