వంగూర్ మండలంలోని గ్రామాలలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని చారకొండ ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని జూపల్లి, గ్రామాలను ఆయన పరిశీలించారు. అనంతరం సర్వే చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. తప్పులు లేకుండా కుటుంబ యజమాని ద్వారా పూర్తి వివరాలు సేకరించి నమోదు చెయ్యాలని ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.