కోడేరు పోలీస్ స్టేషన్ ను బుధవారం డిఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఎస్సై గోర్తికుంట గోకారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరాలను నియంత్రించడంతో పాటు శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే విజిబుల్ పోలీసింగ్ తోనే సాధ్యపడుతుందన్నారు. డయల్ 100కు కాల్ రాగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరించాలని తెలిపారు.