వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, తహశీల్దార్ ఇతర అధికారులపై దాడిని ఖండిస్తూ నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులు, టీఎన్జీవోస్ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్, తహశీల్దార్, ఇతర ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండించారు. బాద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్స్ తో కూడిన వినతిత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు.