నల్ల బెల్లం పట్టివేత.. కేసు నమోదు

73பார்த்தது
నల్ల బెల్లం పట్టివేత.. కేసు నమోదు
కల్వకుర్తి ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం 21 క్వింటాల నల్ల బెల్లం, 40 కేజీల పటిక, 10 లీటర్ల నాటు సారా పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి నిర్వహించిన రూట్ వాచ్ లో భాగంగా తర్నికల్ తండాకు అక్రమంగా అశోక్ లేలాండ్ వాహనంలో నల్ల బెల్లం, పటిక, నాటు సారా తరలిస్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. దీని విలువ సుమారు 12 లక్షలు ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி