ఉట్కూర్ మండలం పెద్దజట్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు వినూత్నంగా మీలో ఎవరు వెయ్యిశ్వర్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంగ్లీష్ టీచర్ వెంకట్రాములు విద్యార్థులను హాట్ చైర్ లో కూర్చోబెట్టి దేశ చరిత్ర, ఇతిహాసాలు, సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టారు. కార్యక్రమంలో విజేతగా నిలిచిన మోహన్ అనే విద్యార్థికి వెయ్యి రూపాయలు అందించారు.