మహారాష్ట్ర లోని దెగ్లూర్ నియోజకవర్గ పరిధిలోని బెలోకి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివృతి కోడింబ కాంబ్లె తో కలిసి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు.