రైతుల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్ రెడ్డి విఘ్నేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదిన్నర ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతులను ఆగం చేశారని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని విమర్శించారు. రెండు లక్షల వరకు వున్న రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పారు.