ఎవరైనా మహిళలను వేధిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. మంగళవారం మాగనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షి టీంపై అవగాహన కల్పించారు. ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తే షి టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మకూడదని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.