కృష్ణ మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థలాన్ని ఎంపిక చేసి ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరగా చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.