ఆత్మకూరు మండలం అమ్మాపూర్ గ్రామ కొండపై వెలసిన కురుమూర్తి స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం దర్శనం చేసుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేశారు. అనంతరం ఉద్ధాలకు పూజలు చేశారు. ఆలయ అర్చకులు శేషవస్త్రాలతో, పూలమాలలు వేసి సన్మానం చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.