రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించడం పట్ల ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ. రైతులకు వెంటనే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. నిరసనలో నాయకులు పాల్గొన్నారు.