కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ కామినేని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. అందులో భాగంగా 171 మందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, షుగర్ లాంటి వ్యాధులకు చికిత్సలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను అందజేశారు.