మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రెసిడెన్షియల్ బాలికల ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. 01-18-2024 నాటికి 14 ఏళ్లు నిండి పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇందుకు అర్హులని వెల్లడించారు. ఆసక్తి గల వారు
ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చన్నారు.