మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన చేప పిల్లలను బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలు మత్స్యశాఖ ద్వారా జీవనోపాధి పొంది ఆర్థికంగా ఎదగాలన్నారు. పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.