ప్రజలకు ప్రభుత్వానికి వారధులు జర్నలిస్టులు: ఎమ్మెల్యే

51பார்த்தது
ప్రజలకు ప్రభుత్వానికి వారధులు జర్నలిస్టులు: ఎమ్మెల్యే
ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా జర్నలిస్టులు నిలవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలో టియుడబ్ల్యూజే ఐజేయు నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఇతర కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி