మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో న్యూ బ్రిలియంట్ పాఠశాలలో 8వ తరగతికి పర్మిషన్ లేకుండానే యజమాన్యం అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఎంఈఓ వెంకటయ్య మాట్లాడుతూ. పర్మిషన్ లేకున్నా 8వ తరగతి, హాస్టల్ నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామన్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాధికారికి నివేదిక పంపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.