ముసురు వర్షంతో తప్పని తిప్పలు

74பார்த்தது
ముసురు వర్షంతో తప్పని తిప్పలు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి రోడ్లన్నీ చిత్తడి, చిత్తడిగా తయారయ్యాయి. అయిజ పట్టణంలోని పాత బస్టాండు కుడలి వద్ద సోమవారం ఉదయం వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వాహన చోదకులు, పాదచారులు రోడ్డును దాటేందుకు పలు రకాల అవస్థలు పడ్డారు. నిల్వ నీటిని పక్కకు మళ్ళించే విధంగా చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி