జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీ. ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ మేరకు ఆల్ ఇండియా అంబేడ్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ ఆలోచన పండగ సందర్భంగా శనివారం నాయకులు ఘనంగా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రధాన రహదారులలో భారీ ర్యాలీ నిర్వహించినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాశ్ తెలిపారు.