మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధు సూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కురుమూర్తి దేవస్థాన కమిటీ నూతన పాలక మండలి అధ్యక్షులు, డైరెక్టర్లను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, మౌలిక వసతులు, నీటి సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు.