వాహనదారులు, ప్రజలు రోడ్డు నియమాలను తప్పకుండా పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ శంషుద్దీన్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ చౌరస్తాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఉన్న చలాన్లను పెండింగ్ లో ఉంచుకోకుండా వెంటనే కట్టాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఎస్ఐ వాహనదారులను హెచ్చరించారు.