మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విజ్ఞానం నేర్చుకొని వ్యవస్థను మంచి మార్గంలో పెట్టడానికి పుస్తక పఠనానికి ఎక్కువ సమయం కేటాయించాలని అందుకు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని కోరారు. స్వాతంత్ర ఉద్యమంలో గ్రంథాలయాల పాత్ర చాలా గొప్పదని తెలిపారు. విద్యార్థి, విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు.