పాలమూరు ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మొత్తం 20 ప్రతిపాదనలతో కూడిన రిప్రెజెంటేషన్ లేఖను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు అందజేశారు. సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యేలా చూడాలని, జీఓ69 కు సంబంధించిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. వీటితో పాటు పలు ప్రతిపాదనలను అమలు ఎంపి డీకే అరుణ సీఎం కోరారు.