దేవరకద్ర, కౌకుంట్ల మండల కేంద్రాలతోపాటు పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం పడింది. ఉదయం నుండి ఎండ వేడిమితో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షం పడటంతో కాస్త ఉపశమనం పొందారు. ఒక్కసారిగా వర్షం రావడంతో పనుల కొరకు బయటికి వెళ్లిన, కూలీలు ప్రజలు, వీధి వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పత్తి రైతులకు ఈ వర్షంతో నష్టం చేకూరుతుందని వాపోయారు. మరో రెండు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారుల తెలిపారు.