మిషన్ భగీరథ కార్య నిర్వాహక ఇంజినీర్ ఇంట్రా, గ్రిడ్ కార్యాలయాలను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి బుధవారం సందర్శించారు. మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్యనిర్వాహక కార్యాలయాలు, సిబ్బంది, పనితీరును అడిగి తెలుసుకున్నారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీ కలెక్టర్ పరిశీలించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.