మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బుధవారం ఇటిక్యాల మండలం బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎంపికి ఘనంగా స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఎంపీడీకే అరుణ మాట్లాడుతూ.. ప్రజలందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.