దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయం ఎదుట భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. అర్ధరాత్రి వరకు నందికొల సేవ, వివిధ గ్రామాల భజన బృందాలచే అఖండ శివనామ సంకీర్తనలను ఆలపించారు. ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రాత్రికి స్వామి వారి డోలారోహణ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.