మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో 4 కోట్ల 70 లక్షల రూపాయలతో మంజూరైన 94 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఆదివారం సాయంత్రం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పేద ప్రజలకు ఇండ్లు మంజూరు చేయడమే కాక నేడు ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.