రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో వ్యక్తిగత వివరాలను ఆదివారం ఎన్యూమరేటర్లు సేకరిస్తున్నారు. ఈ మేరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ఒక్కో ఇంటి వద్ద వివరాలుకు సంబంధించి 54 కోడ్లను నమోదు చేయడానికి ఎన్యూమరేటర్ కు గంటకు పైగా సమయం పడుతుంది. కాగా, కొన్ని ప్రశ్నలకు ఇంటి యజమానులు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు.